ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు .

అవి తొలిగిపోకుండా చూసే పూర్తి బాధ్యత బిఎల్ఏలదే. - ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలి.  - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

బిఎల్ఏల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిశ నిర్దేశం 
Published On
ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు .

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకుండా చూసి పూర్తి బాధ్యత బిఎల్ఎల పైన ఉంటుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం
తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్లో బూత్ లెవల్ ఏజెంట్ల లకు సర్ ఫేస్-2 పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్ ఫేస్-2 లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు అయ్యేలా బిఎల్ఎలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఇప్పటికే
నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఓటర్లకు నోటీసులు అందాయి. వారందరు తప్పకుండా వివరణ ఇచ్చే విధంగా బిఎల్ఎ లు చూసుకోవాలి. నోటీసుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే మమ్మల్ని  సంప్రదించాలి స్పష్టం చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే  దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధార సింగ్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సర్ కన్వీనర్ పురుషోత్తం రావు గారు, పార్లమెంట్ ఇంచార్జి జగదీశ్వర్ గారు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ గారు, ఏఏంసి చైర్మన్ వడ్డే శ్రీనివాస్ గారు, పట్టణ, మండల అధ్యక్షులు, సర్ కొడంగల్ కో ఆర్డినేటర్ మల్లేశ్ యాదవ్ గారు, సర్పంచులు, కౌన్సిలర్లు,  నియోజకవర్గంలోని వివిధ బూత్‌ల బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News