కొత్తూర్ ఆగస్టు 07 (లోకల్ గ్రైడ్ )
మల్లాపూర్ గ్రామం రెడ్డిపల్లెం కాలనీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వార్డు సభ్యురాలు దానగరి స్వాతి రాజేష్ చొరవతో,ప్రజా సేవకు అంకితమైన మాజీ ఎంపీపీ పినింటి మధుసూదన్ రెడ్డి సొంత నిధులతో రెడ్డిపల్లెం కాలనీలో అధునాతన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు.మల్లాపూర్ సర్పంచ్ నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్లను ప్రజలకు అంకితం చేశారు.ప్రజల అవసరాన్ని గుర్తించి.. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో అభివృద్ధి పనులకు చేయూతనివ్వడం మధుసూదన్ రెడ్డి సేవాభావానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు. కాలనీలో రాత్రివేళ వెలుగులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు భద్రతతో పాటు సౌకర్యం కలగనుంది.ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ.. అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న మధుసూదన్ రెడ్డికి కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ తాండ సర్పంచ్ మీనాక్షి దశరథ్ నాయక్,వార్డు సభ్యులు పవిత్ర జయేందర్ రెడ్డి,జార్జ్ రెడ్డి,సుజనమ్మ,రాజు గౌడ్,కె రాజు,హేమరెడ్డి,టీ జార్జి రెడ్డి,టి శౌరెడ్డి,రఫెల్ రెడ్డి, పాపిరెడ్డి,దయాంద్ రెడ్డి,భరత్ రెడ్డి,సి రాజు,జోహాన్ పాల్ కీర్తి, ఇన్నర్ రెడ్డి,బాల్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,రాయప్ రెడ్డి, ధోరణిస్ రెడ్డి,బాలశివ రెడ్డి, అంతోని రెడ్డి,మధు చర్చి ఫాదర్,శాంతి సిస్టర్,ఇనమ్మ, తదితరులు పాల్గొన్నారు.