జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.

Published On
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  .లోకల్ గైడ్ .


నల్గొండ  జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈ నెల 18 ,19 తేదీలలో  రిలే నిరాహార దీక్షలు  చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు  గార్లపాటి  కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి  మహేందర్ రెడ్డి తెలిపారు . దీక్షల నేపథ్యం లో నల్గొండ కలెక్టరేట్  వద్ద స్థల  పరిశీలన చేశారు .నల్గొండ నగర జర్నలిస్టులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయూ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ఈ దీక్షా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం యూనియన్ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి,  యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీక్షా స్థలాన్ని సందర్శించిన అనంతరం, కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లు , స్థల సౌకర్యాలపై ఆయన యూనియన్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టే ఈ దీక్షలను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపాటు  జర్నలిస్టు నాయకులు అబ్బోజు మదనా చారి తదితర  ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.