అనూష్టన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ఆషాఢం బోనాల వేడుకలు

చిన్ననాటి నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలి: ప్రిన్సిపాల్ సునయన

Published On
అనూష్టన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ఆషాఢం బోనాల వేడుకలు

సిద్దిపేట, ఆగస్టు 8(లోకల్ గైడ్):

సిద్దిపేటలోని అనూష్టన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం ఆషాఢం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొని బోనాల పండుగ ప్రత్యేకతను చాటారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఓ.ఆర్. సునయన మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తే వారు భవిష్యత్‌లో ఏ దేశానికి వెళ్లినా మన సంస్కృతి గురించి గర్వంగా చెప్పగలుగుతారని పేర్కొన్నారు.బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. సంప్రదాయాలను కాపాడుతూ, వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఓ.ఆర్. సునయన, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...