యువత కదలాలి.. కాంగ్రెస్ బలోపేతం కావాలి!

యూత్ కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి పిలుపు

Published On
యువత కదలాలి.. కాంగ్రెస్ బలోపేతం కావాలి!

 

లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 9:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా యూత్ కాంగ్రెస్ నాయకులు చురుగ్గా పనిచేయాలని అన్నారు.
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల్లా శ్రీనివాస్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వస్పుల మానయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, నియోజకవర్గ కార్యదర్శి కొప్పు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...