నిరంజన్ రెడ్డిని విమర్శించే నైతికత మేఘారెడ్డికి ఎక్కడిది .!?

కె.ఎల్.ఐ పంపుల ప్రారంభం  బి. ఆర్.ఎస్ విజయం.

ఆంధ్రా ప్రయోజనాలు కాపాడడం కోసం రేవంత్ ఆరాటం.
Published On
నిరంజన్ రెడ్డిని విమర్శించే నైతికత మేఘారెడ్డికి ఎక్కడిది .!?

వనపర్తి లోకలం గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 8:

 కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు,జొన్నల భోగడ,గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి సాగు జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ లు డిమాండ్ చేశారు. శనివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  స్వగృహంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ  ఎమ్మెల్యే మేఘారెడ్డి అవగాహన రాహిత్యంతో ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలలో చులకన అవుతున్నారని వారు ఆరోపించారు.
 నిరంజన్ రెడ్డి కి ప్రాజెక్టుల ,సాగు జలాల మీద అవగాహన లేదని ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కె.సి.ఆర్, నిరంతరం రైతుల సంక్షేమం కోసం జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యతను ముందే పసిగట్టి రియర్వాయర్లు నింపి పంటలు పండించి సస్యశామలం చేశారన్నారు . కానీ , నేటి ప్రభుత్వం ఆంధ్రా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్న సాగు జలాలు వినియోగించుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు. మహారాష్ట,, కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు 2లక్షల 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని, వరద నీటిని సద్వినియోగం చేసుకొని రిజర్వాయర్స్ నింపి వర్షాకాలం,యాసంగి పంటలకు సాగు నీళ్లు ఇవ్వాలన్నారు.  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  నార్లపూర్ రిజర్వాయర్ ముట్టడి చేస్తామని హెచ్చరించిన తర్వాత ఎల్లూరు, జొన్నల భోగడ గుడిపల్లి రిజర్వాయర్ లలో మూడు పంపులు ప్రారంభించామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
  ఎల్.నీ.ఓ పేరిట కె.ఎల్.ఏ నుంచి ఒక పంపు మాత్రమే ప్రారంభించి పంపులు ఆన్ చేశామనడం ప్రభుత్వ అవివేకమన్నారు.  బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 11న నార్లాపూర్ ముట్టడిస్తామని హెచ్చరికలు చేసిన తరువాతే కాలువలకు నీళ్లు వదిలారన్నారు. ఇప్పటికీ  కూడా గుడిపల్లి రిజర్వాయర్ లో నీళ్లు ఎత్తిపోస్తున్నారని, కానీ కాలువలకు ఈ క్షణం వరకు నీరు వదల్లేదన్నారు .
బీఆర్ఎస్ హెచ్చరికల తరువాతనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో మోటార్లు ఆన్ చేశారని వారు చెప్పారు . బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మోటార్లు ఆన్ చేసిందన్నారు .ఈ సమావేశంలో మాణిక్యం, గంధం. పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్, ధర్మశాస్త్ర, మహేశ్వర్ రెడ్డి,  జోహెబ్ హుస్సేన్, సయ్యద్. జమీల్, పాండు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...