- District News
- Khammam
- ఊపిరితిత్తుల వ్యాధులకు శస్త్రచికిత్స అవసరం లేదు అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీతో కోత లేకుండానే చ...
ఊపిరితిత్తుల వ్యాధులకు శస్త్రచికిత్స అవసరం లేదు అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీతో కోత లేకుండానే చికిత్స
యశోదా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రణయ్ సాయి చంద్రగిరి
ఖమ్మం: (లోకల్ గైడ్)జులై 28,
ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసనాళాల అవరోధం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, దీర్ఘకాలిక దగ్గు, రక్తంతో దగ్గు, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వంటి సమస్యల నిర్ధారణ, చికిత్స కోసం గతంలో చాలాసార్లు పెద్ద శస్త్రచికిత్సలు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆధునిక వైద్య సాంకేతికత అభివృద్ధితో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా శరీరాన్ని పెద్దగా కోయకుండా, అత్యల్ప గాట్లతోనే అనేక క్లిష్టమైన ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయడం సాధ్యమవుతోందని హైదరాబాద్ మలక్‌పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు, ఎం.డి(రెస్పిరేటరీ మెడిసిన్), డి.ఎం(పల్మనరీ, క్రిటికల్ కేర్ స్లీప్ మెడిసిన్) డాక్టర్ ప్రణయ్ సాయి చంద్రగిరి పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలక్‌పేట్‌లోని యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసనాళాల ఇరుకుదనం,పునరావృతమయ్యే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ప్లూరల్ ఎఫ్యూషన్, ఎంపిసీమా వంటి క్లిష్టమైన శ్వాసకోశ వ్యాధులకు అత్యల్ప జోక్యంతో, తక్కువ నొప్పితో, వేగవంతమైన కోలుకునే విధంగా ఆధునిక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.
ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది శ్వాసకోశ వైద్యశాస్త్రంలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ. ఇందులో ప్రత్యేక బ్రాంకోస్కోపీలు, అల్ట్రాసౌండ్ ఆధారిత సాంకేతికతలు, చిన్న రంధ్రాల ద్వారా చేసే చికిత్సా విధానాలను ఉపయోగించి ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు, ఛాతీ లోపలి భాగంలోని అనేక క్లిష్టమైన వ్యాధులను నిర్ధారించి చికిత్స అందిస్తారు. సాంప్రదాయ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇవి అత్యల్ప జోక్యంతో పూర్తవుతాయి. ఫలితంగా రోగికి నొప్పి తక్కువగా ఉండటంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ ప్రణయ్ సాయి తెలిపారు.
అందుబాటులో ఉన్న అత్యాధునిక సేవలు
యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ (ఉఆ్ఖఖి) ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ, స్టేజింగ్, అడ్వానస్డ్ ఫ్లెక్సిబుల్, రిజిడ్ బ్రాంకోస్కోపీ, శ్వాసనాళాల్లో ఏర్పడిన కణితులు, అవరోధాల తొలగింపు, ఎయిర్వే స్టెంటింగ్, క్రయోథెరపీ, ఎలక్ట్రోకాటరీ ద్వారా శ్వాసనాళాల చికిత్స, ఊపిరితిత్తుల చుట్టూ పేరుకునే ద్రవం తొలగింపు (ప్లూరల్ ఇంటర్వెన్షన్స్), మెడికల్ థొరాకోస్కోపీ, ఎంపిసీమా రోగులకు బ్రాంకోస్కోపిక్ లంగ్ వాల్యూమ్ రిడక్షన్, ఇమేజ్ గైడెడ్ బయాప్సీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రోగులకు కలిగే ప్రయోజనాలు ఈ ఆధునిక చికిత్సా విధానాల ద్వారా రోగులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయన్నారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం తగ్గుతుంది, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం, నొప్పి తక్కువ, సంక్లిష్టతలు తగ్గుతాయి, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గుతాయి, శ్వాసనాళాల అవరోధం, ఊపిరితిత్తుల్లో నీరు వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. పెద్ద శస్త్రచికిత్స చేయించుకోలేని వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్న రోగులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు.
విప్లవాత్మక మార్పులకు నాంది.
‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ శ్వాసకోశ వైద్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. గతంలో పెద్ద శస్త్రచికిత్స అవసరమైన అనేక ఊపిరితిత్తుల వ్యాధులను ఇప్పుడు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ విధానాలతో సురక్షితంగా నిర్ధారించి చికిత్స చేయగలుగుతున్నామన్నారు. ముఖ్యంగా ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అడ్వానస్డ్ బ్రాంకోస్కోపీ, మెడికల్ థొరాకోస్కోపీ, ఎయిర్వే ఇంటర్వెన్షన్స్, ఇమేజ్ గైడెడ్ విధానాల ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, రోగికి తక్కువ నొప్పితో, తక్కువ రోజుల్లో కోలుకునేలా సమర్థవంతమైన చికిత్స అందించడంసాధ్యమవుతోందన్నారు. దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంతో దగ్గు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులను కూడా సకాలంలో గుర్తించి విజయవంతంగా చికిత్స చేయవచ్చని తెలిపారు.
ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా చికిత్స
ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా క్రింది సమస్యలకు సమర్థవంతమైన చికిత్స అందించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసనాళాల అవరోధం, పదేపదే వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం, ఛాతీలో లింఫ్ గ్రంథుల వాపు, తీవ్రమైన ఎంపిసీమా, ఇతర క్లిష్టమైన శ్వాసకోశ వ్యాధులకు చికిత్స అందుతుందన్నారు.
దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంతో దగ్గు, పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల్లో అనుమానాస్పద మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదిస్తే అనేక ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ, అత్యాధునిక బ్రాంకోస్కోపీ సూట్లు, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, మెడికల్ థొరాకోస్కోపీ, ఆధునిక ఇమేజింగ్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ నిపుణులతో క్లిష్టమైన ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, శాస్త్రీయ చికిత్సా విధానాలు, బహుళ విభాగాల నిపుణుల సమన్వయంతో రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం యశోదా ఆసుపత్రుల లక్ష్యమని వారు పేర్కొన్నారు.
