రైతు భూములకు 22ఏ ఉచ్చు!

నిషేధిత జాబితా నుంచి సాగు భూములను తొలగించాలి —

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
Published On
రైతు భూములకు 22ఏ ఉచ్చు!

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 21 (లోకల్ గైడ్ న్యూస్) : పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం బృందం కారేపల్లి మండలంలోని 22ఏ జాబితాలో ఉన్న సాగు భూముల రైతులతో సమావేశాలు నిర్వహించి, ఆయా భూముల వివరాలను సేకరించింది.

ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో వేలాది ఎకరాల సాగు భూములను పార్ట్‌-2లో ఉంచగా, ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి పేరుతో 22ఏ జాబితాను మరింత పెంచుతోందని విమర్శించారు. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రైతులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని, తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

భూ యజమాని మరణించిన సందర్భంలో వారసులకు భూమి హక్కులు బదిలీ చేయడానికీ 22ఏ జాబితా అడ్డంకిగా మారుతోందన్నారు. దీంతో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై రైతులకు హక్కులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 107, మాణిక్యారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 70, కోమట్లగూడెం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 15లో సుమారు 2 వేల ఎకరాలు, ఇతర గ్రామాల పరిధిలో మరో వెయ్యి ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని బొంతు రాంబాబు తెలిపారు.

22ఏలో భూములు ఉండటంతో బ్యాంకు రుణాల రెన్యూవల్ కాకపోవడం, అధిక వడ్డీతో రుణాలను పూర్తిగా చెల్లించాలని నోటీసులు రావడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 22ఏ జాబితాలో ఉన్న సాగు భూములను తక్షణమే పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, రైతుల భూ హక్కులను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కార్యదర్శి దుగ్గి కృష్ణ, కారేపల్లి మండల కార్యదర్శి వజ్జా రామారావు, సీఐటీయూ జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర, మాజీ సర్పంచులు భూక్యా రమణ, బానోతు సక్రామ్, రైతులు పిప్పల కృష్ణ, గణితి సత్యనారాయణ, తారాచంద్, బుడిగ రాజయ్య, శోభన్, భద్రయ్య, నరసింహారావు, వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం