మాదారం నుంచి సీఎంఆర్ఎఫ్‌కు బలమైన బాట

సర్పంచ్ ఉమా నరేష్ చొరవతో 150 మంది లబ్ధిదారులకు రూ.కోటికి పైగా సీఎంఆర్ఎఫ్ సాయం.. ఎంపీ రఘురాం రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

Published On
మాదారం నుంచి సీఎంఆర్ఎఫ్‌కు బలమైన బాట

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 21 (లోకల్ గైడ్ న్యూస్) : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కొంతమేరకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం ఎంపీ రఘురాం రెడ్డి, మాదారం గ్రామ సర్పంచ్ ఉమా నరేష్ కలిసి సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్‌ ద్వారా అందే ఆర్థిక సహాయం కొంతమేరకు ఆసరాగా ఉంటుందని తెలిపారు. మాదారం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉమా నరేష్ సహకారంతో సుమారు 150 మంది లబ్ధిదారులకు రూ.కోటికి పైగా సీఎంఆర్ఎఫ్‌ నిధులు అందేలా కృషి చేసినట్లు తెలిపారు. గ్రామంలోని అనారోగ్య బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా సర్పంచ్ ఉమా నరేష్ చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం మాదారం, గోవిందా తండా గ్రామాలకు సంబంధించిన పలు కీలక సమస్యలను సర్పంచ్ ఉమా నరేష్ ఎంపీ రఘురాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలూమంగా, కాసాని లక్ష్మీనారాయణ, బట్టు నరసయ్య, వాంకుడోతు వీరన్న, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం