పబ్లిక్ గార్డెన్‌లో ఆరోగ్య అవగాహన సదస్సు

Published On
పబ్లిక్ గార్డెన్‌లో ఆరోగ్య అవగాహన సదస్సు

హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:

హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ మార్కెట్‌లోని ఇతర కంపెనీలు అందించని అనేక విశిష్ట ఫీచర్లను నివా బుపా పాలసీలు కల్పిస్తున్నాయని వాకర్స్‌కు సవివరంగా వివరించారు.నివా బుపా పాలసీ ప్రత్యేక ఆకర్షణలలలో భాగంగా అన్‌లిమిటెడ్ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా అన్‌లిమిటెడ్ పాలసీని వినియోగించుకునే వెసులుబాటు ఉందని,ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అని, ఎటువంటి నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్ ) లేకుండా, సుమారు 142 రకాల ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ లభిస్తుందని,ఈ పాలసీని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా వినియోగించుకునే వెసులుబాటును 'బోర్డర్-లెస్' ఆప్షన్ ద్వారా సంస్థ కల్పించిందన్నారు. 
 క్లెయిమ్ బోనస్ పరంగా కస్టమర్లకు ఇదొక వరం కాగా, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు, ఆరో సంవత్సరంలో ప్రీమియంపై ఏకంగా 30 శాతం రాయితీ లభిస్తుందని,చెల్లింపు సౌలభ్యంలో కస్టమర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం భారం కాకుండా ఉండేందుకు ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అద్భుతమైన సదుపాయం కూడా ఉందన్నారు.
*మనిషి కి నడక ఎంత ముఖ్యమో.. బీమా కూడా అంతే ముఖ్యం*
ఈ సందర్భంగా  వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మన ఆరోగ్యకరమైన నడక ఎంత ముఖ్యమో, మన నిత్యజీవితంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య భీమా కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుచూపుతో పాలసీని తీసుకోవాలని, తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గౌరు రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆకినెపల్లి రవిగుప్త, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం ట్రెజరర్ సుంకర రవి,  సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి, ఇ.సి. సభ్యులు రమణారెడ్డి , హరికృష్ణ, వీరితో పాటు ఈ ప్రతిష్టాత్మక అవగాహన సదస్సులో డాక్టర్ రమేష్, డాక్టర్ భగీరథ, వేణు, గోపి,స్రవంతి రెడ్డి , సత్యా మౌళిక, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Tags:

About The Author

Latest News