బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన మందడపు శ్రీనివాసరావుకు ఘన సన్మానం

న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయం అందేలా కృషి చేయాలి: సిపిఎం నేతలు  ఖమ్మం జిల్లా ప్రతినిధి వైరా , లోకల్ గైడ్ ఆగస్టు 06 

Published On
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన మందడపు శ్రీనివాసరావుకు ఘన సన్మానం

 

 

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రముఖ న్యాయవాది, ఐలు రాష్ట్ర నాయకులు, వైరా ఉద్యమ బిడ్డ మందడపు శ్రీనివాసరావును సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరా మిట్టపల్లి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మందడపు శ్రీనివాసరావును శాలువాతో సన్మానించి, పూలదండ వేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందడపు శ్రీనివాసరావు విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలతో మమేకమై, ఎస్‌ఎఫ్‌ఐలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విద్యార్థులు, ప్రజల హక్కుల కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నారని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో న్యాయవాద వృత్తిలో కూడా ప్రజల పక్షాన నిలుస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా వైరా ప్రాంతానికి, ఉద్యమ నేపథ్యానికి గౌరవం తీసుకువచ్చారని అన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పేదలు, బలహీన వర్గాలు, సామాన్య ప్రజలకు న్యాయం అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేస్తూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. మందడపు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో. అమరజీవి బోడెపుడి వెంకటేశ్వరరావు చూపిన మార్గంలో ప్రజలకు న్యాయం అందే విధంగా. ఉద్యమాల సందర్భంగా కార్యకర్తలపై జరిగే దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేస్తానని తెలిపారు.
అభినందన సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మందడపు శ్రీనివాసరావుకు పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు , బండారు రమేష్,తాళ్లపల్లి కృష్ణ, డివిజన్ నాయకులు మచ్చా మణి, బాణాల శ్రీనివాసరావు, చెరుకుమల్లి కుటుంబరావు, తోట నాగేశ్వరరావు న్యాయవాదు భూక్యా నాగేశ్వరరావు,రాజు, కొప్పుల కృష్ణయ్య, వైరా మాజీ ఎంపీపీ బొంతు సమత, బోయినపల్లి శ్రీనివాసరావు, మాంగంటి తిరుమలరావు, తూము సుధాకర్, షేక్ జమాల్ సాహెబ్, పారుపల్లి శ్రీనాథ్ బాబు, కొత్త సీతారామయ్య, కొంగర సుధాకర్, మల్లెంపాటి రామారావు, బెజవాడ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి? క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు  చిరునామా.  శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి