- District News
- Khammam
- రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యతలు నవీన్ రాథోడ్‌కు... కనకం పవన్ కళ్యాణ్ అభినందనలు
రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యతలు నవీన్ రాథోడ్‌కు... కనకం పవన్ కళ్యాణ్ అభినందనలు
టీపీసీసీ వైరా అసెంబ్లీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కనకం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకోల్లు గ్రామానికి చెందిన యువ నాయకుడు నవీన్ రాథోడ్‌ను టీపీసీసీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నియమించడంపై టీపీసీసీ వైరా అసెంబ్లీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కనకం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ రాథోడ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన నవీన్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కనకం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ముఖ్యంగా యువతను పార్టీతో అనుసంధానం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. నవీన్ రాథోడ్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పాపకోలు ప్రాంతంతో పాటు వైరా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణమని కనకం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
