- District News
- సీల్ ల్యాబ్ రీటారీస్ కంపెనీలో ఘోర ప్రమాదం
సీల్ ల్యాబ్ రీటారీస్ కంపెనీలో ఘోర ప్రమాదం
గ్యాస్ లీక్ తో ముగ్గురి దుర్మరణం , ఇద్దరి పరిస్థితి ఆందోళన కరం. కంపెనీలో ఇది రెండో సారి ఘటన
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి
కంపెనీ ముందు పార్టీలు,సంఘాల ధర్నా
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 5:
నారాయణపేట జిల్లా కృష్ణ మండల సరిహద్దు లోని కర్ణాటక రాష్ట్రం కడే చూరు ఇండస్ట్రియల్ ఏరి యాలో మంగళవారం అర్ధ రాత్రి ఒక ఫార్మా కంపెనీ లో గ్యాస్ లీక్ కావడంతో ఘోర ప్రమాదం జరిగింది.లీక్ అయిన గ్యాస్ ను పీల్చుకో వడంతో అక్కడ పని చేస్తు న్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు.మరో ఇద్ద రి పరిస్థితి ఆందోళన కరం గా ఉంది.రాష్ట్ర సరిహద్దు లోని కర్ణాటక లో ని కాడేచు ర్ సీల్ ల్యాబేరేటరీస్ ప్రవై ట్ లిమిటెడ్ కంపెనీ అర్ధరాత్రి రియాక్టర్ నుండి గ్యాస్ లీకు అయ్యి వాసనా రావడం తో ఐదుగురు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు, అందులో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు, మిగి తా ఇద్దరినీ చికిత్స నిమి త్తం అస్పత్రి కి తరలించా రు, మృతుల్లో తెలంగాణ రాష్ట్ర నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం అలం పల్లి గ్రామానికి చెందిన గణేష్ (కేమిస్ట్ ) బీహార్ కు చెందిన మరో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఘటన తెలుసుకోని బాధిత కుటుంబానికి మద్ద తుగా అనంపల్లి గ్రామస్థు లు బి ఆర్ ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, మాజీ సర్పంచ్ రామకృష్ణ దని, నర్సిములు, డీలర్ శివరా జ్,తిప్పన్న,జై కర్ణాటక రక్షణ సేన జిల్లా అధ్యక్షులు మల్లికార్జునజల్లప్ప,సైదాపూర్ ఓబిలి అధ్యక్షులు వీరేష్ సజ్జన్,కాడే చుర్ గ్రామ అధ్యక్షులు శరణప్ప, కర్ణాటక చాలాకర్ ఒకపుట రాజు మాడీ వల్, మాజీ రక్షణ సేన అధ్యక్షులు చంద్రు పార్ల, ఉపాధ్యక్ష హుసేనప్ప,నారాయణ పేట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్య క్షులు వెంకట్ రాములు, సీనియర్ నాయకులు దేవరింటి నర్సింహా రెడ్డి, కృష్ణ మండలం అధ్యక్షులు నల్లే నర్సీప్ప, యువ నాయ కులు సంజు గౌడ బాధితు లకు మద్దతుగా కంపెనీ వద్దకుంచేరుకుని ఆందోళన చేపట్టారు. కర్ణాటక డీ ఎస్ పి నాగరాజు బాధితులకు న్యాయం చేకూరస్తామని చెబుతున్నప్పటికి తగ్గకుం డా ఆందోళన కొనసాగించా రు, కంపెనీ ఎండీ వచ్చి చని పోయిన బాధితులు గణేష్ కు కోటి రూపాయలు పరి హారం ఇచ్చే వరకు కదిలే పరిస్థితి లేదని భీస్మించి కూర్చున్నరు, కంపెనీ గేట్ నుండి లోపలికి దూసుకు పోవడానికి గట్టి ప్రయత్నం చేశారు, వీరిని పోలీస్ లు అడ్డుకొని కంపెనీ ప్రతిని ధులతో మాట్లాడిస్తామని వారిని శాంత పరిచారు, ఎస్పీ పృద్విక్ శంకర్ తో చర్చలు..
కాడేచుర్ గ్రామ పెద్ద సిద్ద న్ గౌడ, అలంపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ దని, అనంపల్లి గ్రామ పెద్దలు, జై కర్ణాటక సంఘము ప్రతినిధులు వీరేష్ సజ్జన్ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, బాధితుని కి న్యాయం చెయ్యాలని ఎస్పీ తో చర్చలు జరిపారు,
లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్:1.మృతి చెందిన కార్మికుడు గణేష్,2.కంపెనీ ముందు ధర్నా చేస్తున్న వివిధ పార్టీల నాయకులు
______________________
Tags:
About The Author
Related Posts
Latest News
05 Aug 2026 18:25:34
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 05:
నిజామాబాదు జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం...
