సింగరేణి అభివృద్ధికి మరో అడుగు.. సర్పంచ్ టోనీకి ప్రత్యేక శిక్షణకు అవకాశం!

ఖమ్మం జిల్లా నుంచి ఎంపికైన 10 మంది సర్పంచ్‌లలో మేదరి వీరప్రతాప్‌కు చోటు

హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో నాయకత్వం, పరిపాలన, మానసిక శ్రేయస్సుపై శిక్షణ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాభివృద్ధికి వినియోగిస్తా: సర్పంచ్ టోనీ
Published On
సింగరేణి అభివృద్ధికి మరో అడుగు.. సర్పంచ్ టోనీకి ప్రత్యేక శిక్షణకు అవకాశం!

 

 

 

 

కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 5, లోకల్ గైడ్ న్యూస్ : సింగరేణి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ)కు మరో అరుదైన అవకాశం లభించింది. సర్పంచ్‌లలో విలువలు, నాయకత్వ సామర్థ్యం, పరిపాలనా నైపుణ్యం, మానసిక శ్రేయస్సును పెంపొందించేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి ఎంపికైన పది మంది సర్పంచ్‌లలో మేదరి వీరప్రతాప్‌కు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) మాట్లాడుతూ.. సింగరేణి గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, ప్రేమ, ఆశీర్వాదాలే తనకు బలమని అన్నారు. ప్రత్యేక శిక్షణలో నేర్చుకునే మంచి అంశాలను సింగరేణి గ్రామ అభివృద్ధికి ఉపయోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. “పదవి బాధ్యత మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం” అనే లక్ష్యంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. సింగరేణి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని, ప్రజాసేవే తన ధ్యేయమని సర్పంచ్ టోనీ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఎంపికైన పది మంది సర్పంచ్‌లలో సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్‌కు అవకాశం లభించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
85 పడకల నూతన ఆసుపత్రి భవనం వద్ద అంతర్గత రహదారులు, లైటింగ్ ఏర్పాటు చేయాలి* రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం
డైస్,యు పి ఎచ్ సి, ఎస్ ఎన్ సి యు, ఎన్ ఆర్ సి ల సేవలపై డి ఎం ఎచ్ ఓ తనికి.
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ