- District News
- Nalgonda
- కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై 4 వ రోజు నిరసన.
కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై 4 వ రోజు నిరసన.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్ .
కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై శనివారం 4వ రోజు బీఆర్ఎస్ నల్గొండ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 5000 మంది విద్యార్థులతో ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.గడియారం సెంటర్ వద్ద జరిగిన సభలో పలువులు పలువురు విద్యార్థులు పాటలు పాడి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని 97 జీఓ రద్దు చేయాలని కోరుతూ ప్రసంగించారు.విద్యార్థులు అనూష, వెన్నెల,సైఫ్,తదితరులు ఉత్తెజ పూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు సభలో పాల్గొన్న వారందరూ చప్పట్లతో వారికి మద్దతు పలికారు .అంతకుముందు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జెడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ కాంటెస్ట్ క్యాండిడేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు వారు మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ విఫల పాలనలో విద్యార్థులు నిరుద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని ప్లీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో... పేద విద్యార్థులు కాలేజీలు మానేయవలసిన పరిస్థితి ఏర్పడిందని, చదువు పూర్తయిన వారి కి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవటంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో... వారు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని దీనితో నిరుపేదలైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు మనోవేదన, చెందుతున్నారని, కొంతమంది తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి ఫీజులు చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఘోరంగా పాలి టెక్నిక్, విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం చేశారని 97 జీవో ద్వారా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఫ్యాకల్టీ, విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోకుండా 97 జీవోను విడుదల చేసి విద్యార్థుల జీవితాలతో ఆతలాడుకుంటున్నారని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని 97 జీవం రద్దు చేయాలని లేకుంటే విద్యార్థులతో కలిసి తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని లక్ష మందితో సభను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని, విద్యార్థుల్లోకానికి నిరుద్యోగ లోకానికి తాము అండగా ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య,మైనం శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్ పెరిక యాదయ్య పేర్ల మల్లీశ్వరి అశోక్ రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కొండూరు దీపికా ప్రవీణ్ రెడ్డి బాణావత్ దీప్లా దొడ్డి రమేష్ స్వాతి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్, మిర్యాల యాదగిరి, రావుల శ్రీనివాస్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ,పెరిక కరణ్ జయరాజ్, దండంపెల్లి సత్తయ్య, గుండెబోయిన జంగయ్య కందుల లక్ష్మయ్య బడ్పుల శంకర్ కోట్ల జయపాల్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
