క్రైస్తవ మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

యు డి సి ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వంగూరి జయమ్మ..

Published On
క్రైస్తవ మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

 

  నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

ఇద్దరు  క్రైస్తవ మహిళలను అతి దారుణం కొట్టి హింసించడం దుర్మార్గమైన చర్య అని వారిని  కఠినంగా శిక్షించాలని  యూడి సి ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు పాస్టరమ్మ  వంగూరి జయమ్మ( దేబోరా ) అన్నారు.   పట్టణంలోని గడియారం సెంటర్లో గల బాప్టిస్ట్ చర్చిలో  యూడీసీఫ్ జిల్లా అధ్యక్షుడు డి. ఐ శాంసన్ , ప్రధాన కార్యదర్శి పెదమాము డేవిడ్ రాజు ఆధ్వర్యంలో యూడీసీఫ్ జిల్లా మహిళ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా పాస్టరమ్మ  వంగూరి జయమ్మ( దేబోరా ) కమిటీ సభ్యులుగా శృతి , శైలజ , రుతమ్మ , వెంకటమ్మ , రాజకుమారి , వరలక్ష్మి , నాగేంద్ర , నాగమణి , విజయరాణి, నాగమణి , లిడియా ను ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన మహిళా అధ్యక్షురాలు పాస్టరమ్మ  వంగూరి జయమ్మ( దేబోరా ) మాట్లాడుతూ తమపై నమ్మకంతో తనను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ  సంఘ  బలోపేతానికి కృషి చేస్తూ  క్రైస్తవ సమాజ అభివృద్ధి కై నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాదులోని  అల్మస్ గూడ లో ఇద్దరు మహిళలపై మత ప్రచారం చేస్తున్నారన్నా  నెపంతో అతి దారుణం కొట్టి హింసించడం దుర్మార్గమైన చర్య అన్నారు.  మహిళల ని చూడకుండా దుర్భాషలాడుతూ దాడి చేయడం హేయమైన చర్య అని ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై  ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 
క్రైస్తవులకు చట్టపరమైన రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  క్రైస్తవ నాయకులు అజార్య నాయక్, ఏపీ.ప్రభాకర్, చంద్ర పాల్, లింగ రెడ్డి, లాజర్, యోహాను, లూకాస్, యాకీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు! గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు!
        కారేపల్లి, నవంబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్): సింగరేణి మండలం గంగారం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో
క్రైస్తవ మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు అల్పాహార వితరణ.
వెంకటాపురం మండలంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు –  నలుగురు వ్యక్తులపై చట్టపరమైన కేసులు
వికారాబాద్ - శంకర్పల్లి మార్గంలో దట్టమైన పొగమంచు: వాహనదారుల తీవ్ర అవస్థలు
నూతన దంపతులకు బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయ ఆశీస్సులు!
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!