- District News
- Ranga Reddy
- ఇబ్రహీంపట్నంలో ఘనంగా కామ్రేడ్స్ పాషా, నరహరి 37వ వర్ధంతి
ఇబ్రహీంపట్నంలో ఘనంగా కామ్రేడ్స్ పాషా, నరహరి 37వ వర్ధంతి
Published On
By Ram Reddy
పేద ప్రజల హక్కులు, భూమి కోసం అసువులు బాసిన అమరులు మహబూబ్ పాషా, నరహరిల ఆశయాలను సాధించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామెల్ పిలుపునిచ్చారు. సోమవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పాషా, నరహరిల 37వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సామెల్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి, వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన యోధులు పాషా, నరహరి అని కొనియాడారు. వారి ప్రజాదరణను ఓర్వలేకే ప్రత్యర్థులు వారిని కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 37 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో వారి స్థానం పదిలంగా ఉందన్నారు. నాడు ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలకు దక్కిన భూములను నేడు ప్రభుత్వాలు పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వెంటనే రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, మండల కార్యదర్శి బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు జంగయ్య, జగన్, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, నాయకులు ప్రకాష్ కారత్, ముసిలయ్య, స్వప్న, పురుషోత్తం, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Nov 2026 18:22:00
కారేపల్లి, నవంబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్):
సింగరేణి మండలం గంగారం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో
