డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు అల్పాహార వితరణ.

Published On
డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు అల్పాహార వితరణ.

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.

 

 సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ వీల్స్ అండ్ మీల్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. సమాచార హక్కు, ఓటరు చైతన్యంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి, అల్పాహారం పంపిణీ చేశారు.అంతకుముందు పానగల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మదన్మోహన్ రేపల, వైస్ గవర్నర్ సతీష్ కోడె, లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి న్యూ వాయిస్ మాజీ అధ్యక్షురాలు సరిత కోట, మాజీ జోనల్ చైర్మన్ ఝాన్సీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్, జ్యోతి రెడ్డి, న్యాయవాదులు అక్కెనపల్లి మురళీధర్ రావు, కీసర శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ సభ్యులు మారం వెంకటరమణ రెడ్డి, మాధవి, నిర్మల, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు వాడపల్లి సాయి బాబా, మాదగోని బిక్షపతి గౌడ్, తాళ్ల నిరంజన్, కర్నాటి యాదగిరి, బోనగిరి సందీప్, సంతోష్, మేడి యాదయ్య, శ్రీ వాస్తవ్, స్నిగ్ధ, రాములు, ఆసుపత్రి సిబ్బంది, రోగుల సహాయకులు, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు! గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు!
        కారేపల్లి, నవంబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్): సింగరేణి మండలం గంగారం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో
క్రైస్తవ మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు అల్పాహార వితరణ.
వెంకటాపురం మండలంలో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు –  నలుగురు వ్యక్తులపై చట్టపరమైన కేసులు
వికారాబాద్ - శంకర్పల్లి మార్గంలో దట్టమైన పొగమంచు: వాహనదారుల తీవ్ర అవస్థలు
నూతన దంపతులకు బానోత్ సుందర్‌లాల్ ఆత్మీయ ఆశీస్సులు!
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరా!