- District News
- Khammam
- బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు... దరఖాస్తుల ఆహ్వానం...బిసి అభివృద్ధి అధికా...
బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు... దరఖాస్తుల ఆహ్వానం...బిసి అభివృద్ధి అధికారిణి జ్యోతి
అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖమ్మం, సెప్టెంబర్ 10: లోకల్ గైడ్:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన మహిళలై ఉండాలని, 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. నిరుద్యోగ మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలకు మించకూడదని, తెల్ల రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగిన వారికి, అలాగే కనీస ప్రాథమిక అక్షరాస్యత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులను *tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా సమర్పించాలని తెలిపారు.
అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్దేశిత గడువులోగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో గ్రామీణ ప్రాంతవాసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ వాసులు మునిసిపల్ కమీషనర్ లకు దరఖాస్తులు సమర్పించాలని బిసి అభివృద్ధి అధికారి జ్యోతి ఆ ప్రకటనలో కోరారు.
