సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్

సర్పంచ్ రాందాస్, ప్రధానోపాధ్యాయులు హాజ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ

Published On
సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : మండలంలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల యూనిఫాంలు, బూట్లు, సాక్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాజ్య ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రాందాస్, వార్డు సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు, సాక్సులను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. ఉచిత యూనిఫాంలు, బూట్లు, సాక్సుల పంపిణీ వల్ల విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు పాఠశాల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాందాస్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులపై కూడా కార్యక్రమంలో చర్చించారు. విద్యార్థుల హాజరు, చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు హరిదాస్, గ్రామస్తులు హరియా నాయక్, ఉపాధ్యాయులు రాజేష్, సుజాత, విజయకుమారి, వీరన్న, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ. నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్ .  నల్గొండలోని  నెగ్జా (పవన్ మోటార్స్) షోరూమ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ది స్టన్నింగ్ న్యూ
సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు
_గురువులకు ఘన సన్మానం.. కళలకు పెద్దపీట
శంషాబాద్ లో ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలనిమంత్రి శ్రీధర్ బాబుకి  వినతి పత్రం
సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు .
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా