దుబ్బతండా గణేశ్ నిమజ్జనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిపూడి తిరుమలరావు , సర్పంచ్ మత్రు నాయక్

Published On
దుబ్బతండా గణేశ్ నిమజ్జనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిపూడి తిరుమలరావు , సర్పంచ్ మత్రు నాయక్

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం దుబ్బతండాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమలరావు, సర్పంచ్ మత్రు నాయక్ పాల్గొన్నారు. తొమ్మిది రోజులుగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో కొనసాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు, మత్రు నాయక్ గణేష్ మండపానికి చేరుకుని విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. దుబ్బతండా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి–సమృద్ధులతో జీవించాలని వారు ఆకాంక్షించారు. గణేశ్ నిమజ్జన వేడుకల్లో భక్తులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలు, నృత్యాలతో సందడి చేశారు. దీంతో దుబ్బతండాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంగోత్ బాషా, అంగోత్ రాంబాబు, నూకల మోహన్‌రావు, తేజావత్ భావ్‌సింగ్, అంగోత్ మధులత, బానోత్ రేణుక, గుగులోత్ బాలాజీతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News