స్పీకర్‌పై వ్యాఖ్యలు... కామేపల్లిలో నిరసన సెగ!

తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ – దిష్టిబొమ్మ దగ్ధం

Published On
స్పీకర్‌పై వ్యాఖ్యలు... కామేపల్లిలో నిరసన సెగ!

 

 

కామేపల్లి, సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కామేపల్లి మండల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం కామేపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ అహంకారానికి నిదర్శనమన్నారు. దళిత సమాజానికి చెందిన స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం యావత్ దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఫతే మహమ్మద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూరి శివయ్య, కొమ్మినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ధనియాకుల హనుమంతరావు, కొమ్మినపల్లి సర్పంచ్ అనురాధ, రామకృష్ణాపురం సర్పంచ్ అజ్మీర చిన్ని, సర్పంచులు, ఉప సర్పంచులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గబ్రు నాయక్, మాజీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు రాందాస్ నాయక్, తిరుపతయ్య, ఎడ్లపల్లి శేషగిరిరావు, సుధానపు కోటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News