దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు...

స్పీకర్ పై వ్యాఖ్యలు బిఆర్ఎస్ అగ్రహారంకారానికి నిదర్శనం

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఖండించిన బెల్లంపల్లి కాంగ్రెస్. 
Published On
దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు...

 

 

..

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు సరికావని,అవి స్పీకర్‌ పదవిని అవమానించే విధంగా ఉన్నాయని బెల్లంపల్లి కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత గౌరవం కలిగిన స్పీకర్‌ పదవిని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కార్యాలయం నుండి అంబేద్కర్ కాంటా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతు శాసనసభ స్పీకర్‌ పదవి కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని,మొత్తం శాసనసభకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన గౌరవప్రదమైన పదవి అని అన్నారు.అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు దళిత స్పీకర్‌ పట్ల బీఆర్ఎస్‌ అగ్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తోందని ఆరోపించారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు,రాజ్యాంగం,సామాజిక న్యాయం గురించి మాట్లాడిన బీఆర్ఎస్‌ నాయకులు ప్రస్తుతం అదే రాజ్యాంగ వ్యవస్థలోని కీలక పదవిలో ఉన్న దళిత నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.రాజకీయంగా విభేదాలు ఉండొచ్చని,విధానాలపై విమర్శలు చేసుకోవచ్చని,అయితే వ్యక్తిగత విమర్శలకు దిగడం,రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్‌ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే శాసనసభ నిబంధనలకు అనుగుణంగా అభిప్రాయాలను వ్యక్తం చేయాలి తప్ప,వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్య సంస్కృతికి మంచిది కాదని హితవు పలికారు.బీఆర్ఎస్‌ నాయకత్వం ఇప్పటికైనా తన వైఖరిని పునఃసమీక్షించుకుని,స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.రాజ్యాంగ పదవులకు, ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు.ప్రజల్లో చైతన్యం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో కులం,పదవి,వ్యక్తిగత విమర్శలను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించడం తగదని సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా బీఆర్ఎస్‌ అగ్ర నాయకత్వం తన నేతలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.స్పీకర్‌ పదవికి పూర్తి గౌరవం ఇవ్వాలని,ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే వ్యాఖ్యలకు స్వస్తి పలకాలని కోరారు.రాజ్యాంగం కల్పించిన సమానత్వం,సామాజిక న్యాయం,ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ కోరారు.ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత,నాయకులు చిలుముల శంకర్,దేవసాని ఆనంద్,జమ్మికుంట విజయ్,గుజ్జ రవి గెల్లి రాయిలింగు,ఎలుక ఆకాష్,ఖదీర్,ఖలీల్,సత్యవతి,చుంచు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News