సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి.

రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలి — దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్. 

Published On
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలి.


                   

రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ): 
తెలంగాణ శాసనసభ  సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ పై అసభ్యకరమైన పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాజేంద్ర నగర్, అత్తా పూర్ సర్కిళ్ల దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. 
మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ ని ఉద్దేశించి తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజేంద్రనగర్ ప్రధాన కూడలిలో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తాత మధు దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా తాత మధు దిష్టిబొమ్మకు చెప్పులతో కొట్టి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ వ్యవస్థకు, తెలంగాణ సమాజానికే అవమానకరమని మండిపడ్డారు. 
ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడటాన్ని ఎంతమాత్రం సహించబోమన్నారు.  అందువల్ల తాత మధును వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన అనుచిత ప్రవర్తనకు పాల్పడకుండా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్య వేదిక మాండ్ చేసింది.
రాజ్యాంగ పదవుల గౌరవం కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అయితే పదవులు వ్యక్తిగత దూషణలకు వేదికలు కాకూడదన్నారు. రాజ్యాంగ విలువలను అవమానించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జయంతి ఉత్సవాల కమిటీ ప్రధాన కార్యదర్శి నవజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షులు మంగళారం శ్రీనివాస్, నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం మాజీ అధ్యక్షులు పంబల రాజు, పోతురాజు యాదయ్య, సీనియర్ నాయకులు కోరని బాలరాజు, అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు అనుముల జాన్ పాల్,  ఉప్పర్‌పల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సన్న జగన్, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ   కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అదిరాల రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  సంగేపాగ రత్నం, నవయువత యూత్ లీడర్స్  పలుగుచెరువు మహేందర్, ఎమ్మార్పీఎస్ ఉప్పర్‌పల్లి అధ్యక్షులు అరింట్ల విశాల్, నేషనల్ అంబెడ్కర్ సేన సర్కిల్ కన్వీనర్ గొడుగు సంజీవ, సిరిగిరి వెంకటేశం, నవజ్యోతి యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు బాండ్ర  పద్మారావు, యస్. జగదీశ్వర్, రజక సంఘం యువ నాయకులు సురేష్, ఈశ్వర్, జి. రాకేష్, దళిత సంఘం గడ్డం సామెల్, ఆటో టిల్లు ప్రవీణ్, నర్సింహా, గంగాధర్, గట్టుపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
:::

Tags:

About The Author

Latest News