పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...

1,00,000/-  ఎల్ ఓ సి అందచేసిన మండల కాంగ్రెస్ పార్టీ. అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్...

పాల్గొన్న అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్. గోపాల్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి...
Published On
పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...

షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో నివసిస్తున్న పి సురేష్ కూతురు చిన్నారి నిషిక అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గ్రామంలోని సర్పంచ్ గోపాల్ రెడ్డి మరియు భరత్ రెడ్డి గార్ల సహకారంతో గౌరవ శాద్నగర్ శాసన సభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ అన్న గారి ఉదారగుణం చిన్నారికి 100000/- రూపాయల ఎల్ ఓ సి అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్. 

రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన నియోజకవర్గంలోని ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎవరికైనా ఆరోగ్య నిమిత్తం పేద ప్రజలు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంతోమంది శంకరన్న గారి ఆధ్వర్యంలో ఎల్ ఓ సి లు అందుకున్నారని ఆయన అన్నారు.. ఈ ప్రభుత్వం పేదలకు అందుబాటులో ఉంటుందని, నిత్యం షాద్ నగర్ ప్రజల గురించి పరితపించే మన MLA శంకరన్న మనకు దొరకడం మన అదృష్టం అని ఆయన అన్నారు... CM రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని, రాష్ట్రంలోని ప్రతి పేదవారికి మరియు అర్హులందరికీ ప్రజా పాలనలోని పథకాలు అందుతున్నాయని ఆయన అన్నారు...

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సింగిల్విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్ ముదిరాజ్, కేశంపేట అధ్యక్షులు రమేష్, మాజీ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, అయ్యవారిపల్లె సర్పంచ్ గోపాల్ రెడ్డి, భరత్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మాధవులు, ప్రసాద్, జంగయ్య, గంగారాం, జంగారి రవి మరియు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.....

Tags:

About The Author

Latest News