- District News
- Khammam
- ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌పై గౌసుద్దీన్ ఫైర్.. వెంటనే విడుదల చేయాలి!
ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌పై గౌసుద్దీన్ ఫైర్.. వెంటనే విడుదల చేయాలి!
కారేపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకుడు షేక్ గౌసుద్దీన్
Published On
By Ram Reddy
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 8,లోకల్ గైడ్ న్యూస్ : శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కారేపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు, రైతుల సమస్యలపై నిరంతరం ప్రశ్నించే నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతా మధుసూదన్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని గౌసుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుల గొంతుకలను అణచివేసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ప్రజల, రైతుల సమస్యలపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గౌసుద్దీన్ స్పష్టం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
08 Sep 2026 15:48:44
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి: పాలడుగు వెంకటకృష్ణ
