- District News
- ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.
అదనపు కలెక్టర్ విక్టర్
Published On
By Ram Reddy
కామారెడ్డి జిల్లా ఆగస్టు 24 లోకల్ గైడ్
65 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 65 ఫిర్యాదులు అందాయి.
ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపించి నిబంధనల ప్రకారం పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హత ఉన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, భూ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, సీఈఓ చందర్, డిఆర్ఓ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 15:23:36
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా
