ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదెక్కడి రాజనీతి ,నీచమైన నైతిక విలువలు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి. ఫామ్ హౌస్ లో ట్రైనింగ్ బాగానే ఇచ్చారూ కదా కేసీఆర్

తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి   పిఏసిఎస్ చైర్మన్ కొందుర్గు-- చౌదరి గూడ..
Published On
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదెక్కడి రాజనీతి ,నీచమైన నైతిక విలువలు..

లోకల్ గైడ్ న్యూస్ 08 కొందుర్గ్..


తెలంగాణ. రాష్ట్ర శాసన సభ వర్షా కాల సమావేశాలలో బిఆర్ఎస్ పార్టీ.ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరును చూసి యావత్ సమాజము చాలా దిగ్ర్భాంతికి గురైంది  అట్టు అసెంబ్లీ గేట్ల వద్ద  పోలీస్ అధికారులు ప్రత్యక్ష దాడులు అసెంబ్లీ లోపల స్పీకర్ పై  అనుచిత వ్యాఖ్యలు చాలా  బాధాకరం అనిపించాయి......  అయితే శాసనసభ,శాసనమండలి లోకి ప్లకార్డుల ప్రదర్శన నినాదాలతో కూడిన చొక్కాలు ధరించకుండా గతంలో నిషేధం విధిస్తూ మీరే కదా చట్టాలు చేసింది మీరు చట్టాలు చేస్తారు కానీ మీరు పాటించరు సాధారణ టీ షర్టులు వేసుకొని వస్తే ఎవరు ఆపరు వాటిపైనిబంధనలకు విరుద్ధంగా నినాదాలు ప్రింట్ చేసుకొని వచ్చి నందుకే  ఆపారు యధా రాజా తధా నాయక అన్నట్లు ఉంది మీ వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడేలా అసెంబ్లీ గేటు వద్ద బట్టలు విప్పుకోవడం నీతిమాలిన చర్య మహిళా ప్రజా ప్రతినిధులు మిగతా బిఆర్ఎస్ సభ్యుల తో పాటు ఉన్నందుకే వారికి ఇబ్బంది కలిగింది అయినా దీని పట్ల ప్రభుత్వంఎంక్వయిరీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది  రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ సభ్యులపై బిఆర్ఎస్ వైఖరి ఏంటో ప్రజలకి చెప్పాలి సభలో మాట్లాడడానికి ఏమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న బిఆర్ఎస్ స్పార్టీ మిమ్మల్ని అసెంబ్లీకి మండలికి పంపించింది ప్రజల సమస్యల మీద. చర్చించడానికి అంతేగాని గేటు బయట బట్టలు విప్పుకొని పోలీసులతో కొట్లాడడానికి కాదు
గతంలో చిన్న కారణానికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సంపత్ కుమార్ లను బర్తరఫ్ చేశారు
మరి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీసులపై దౌర్జన్యానికి  దిగటం సమాజంలో మీ వైఖరి చాలా స్పష్టంగా అర్థమైంది స్పీకర్ పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను బే షరతుగా  శ్కమాపన చెప్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తిరిగి తీసుకోవాలని ప్రజా   స్వామ్యానికి అందరు కట్టుబడి సభా గౌరవ మర్యాదలు కాపాడాలని కొందుర్గ్ పి ఏ సి ఎస్ చైర్మన్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారూ..*

Tags:

About The Author

Latest News