క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

2030కి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం...

జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య 
Published On
క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

 

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు.గురువారం జిల్లా భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కిషన్,ఎన్‌ సి సి కమాండెంట్ లతో కలిసి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 2030నాటికి దేశంలో టిబి (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు,మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి,ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని,మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే15 టిబి ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు తెలిపారు.టిబి వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని,దగ్గు,తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు.సాయంత్రం వేళల్లో జ్వరం రావడం,ఆకలి తగ్గడం,బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ముఖ్యంగా షుగర్,బిపి ఉన్నవారు,పొగతాగే అలవాటు ఉన్నవారు,రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని,గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి,అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలో ప్రస్తుతం 265యాక్టివ్ టిబి కేసులు ఉన్నాయని,టిబి రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు1వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించనున్నట్లు తెలిపారు.నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని,క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు.సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు.టిబి రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని,వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు,నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.మండల స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు,ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టిబి రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.దేశ వ్యాప్తంగా టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రామస్థాయిలో సర్పంచులు,పంచాయతీ అధికారులు,వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టిబి నిర్మూలనకు కృషి చేయాలని,రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం,మానసిక ధైర్యం అందించాలని సూచించారు.టిబి నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు.టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్1800-11-6666 ద్వారా అందించనున్నట్లు తెలిపారు.అనంతరం టిబి ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి,టిబి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు,ప్రజాప్రతినిధులు,సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.టిబి నిర్మూలనకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు,పంచాయతీ కార్యదర్శులు,సర్పంచులు,ఎఎన్‌ఎంలు,ఆశా కార్యకర్తలు,ఎన్‌ సి సి,మై భారత్ క్యాడెట్లు,వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ