- District News
- _మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
_రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా ఇన్‌చార్జ్ రోజా రాణి కూడా పాల్గొని డా. రామకృష్ణకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
కుత్బుల్లాపూర్ అక్టోబర్ 04 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గవర్నర్ కోటాలో ప్రముఖ వైద్యులు, ప్రజాసేవకులు డా. పెరుమాండ్ల రామకృష్ణ మాదిగకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు మాదిగ హక్కుల దండోరా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంస్థ మహిళా అధ్యక్షురాలు రోజా రాణి ఒక ప్రకటనలో కోరారు.ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన డా. రామకృష్ణ, అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజా సమస్యలు, దళిత–బహుజన సంక్షేమం కోసం పనిచేస్తున్నారని మాదిగ హక్కుల దండోరా నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలించాలని కోరుతూ సుమారు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేఖలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో పలు కేసులు ఎదురైనా పార్టీని వీడకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగారని తెలిపారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తనకు టికెట్ వచ్చిన సమయంలో ఎంత కష్టపడతారో అదే స్థాయిలో పనిచేసి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతను కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలని కోరారు.రామకృష్ణ చారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలు, బలహీన వర్గాలకు వైద్య, సామాజిక సేవలు అందిస్తూ డా. రామకృష్ణ ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజాసేవ కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఉద్యోగానికి రాజీనామా చేసి సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన సామాజిక సేవలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు విదేశాల నుంచి కూడా పలు అవార్డులు లభించినట్లు తెలిపారు.వైద్య రంగంలో అనుభవంతో పాటు ప్రజా సమస్యలపై పనిచేస్తున్న డా. రామకృష్ణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే మాదిగలతో పాటు పేదలు, దళిత–బహుజన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని రోజా రాణి పేర్కొన్నారు. ఆయన సేవలు, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీ పదవికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానాన్ని మాదిగ హక్కుల దండోరా తరపున కోరారు.ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా ఇన్‌చార్జ్ రోజా రాణి కూడా పాల్గొని డా. రామకృష్ణకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని
