- District News
- Ranga Reddy
- రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు....
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
Published On
By Ram Reddy
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):
కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, మహిళల ఆటపాటలు, కోలాటం ఆటలతో గణపయ్య ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. రాజేంద్ర నగర్ జోన్ పరిధిలోని శివరాం పల్లి, ప్రశాంత్ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, ఆదర్శనగర్, బాబుల్ రెడ్డి నగర్, సాయిబాబా నగర్, బృందావన్ కాలనీ, ప్రగతి
కాలనీ, రాఘవేంద్ర కాలనీ, మైలార్దేవ్ పల్లి, ఉడంగడ్డ, వినాయక నగర్, దుర్గా నగర్, లక్ష్మీగూడా, మార్కండేయ నగర్, లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ, మధుబన్ కాలనీ, టి ఎన్జీవోస్ కాలనీ, పద్మశాలి పురం, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీ, నేతాజీ నగర్, వెంకటేశ్వర కాలనీ, దుర్గా హిల్స్, గణేష్ నగర్, ఆప్కో కాలనీ, గగన్ పహాడ్, బుద్వేల్ రైల్వే స్టేషన్ బస్తి, మోహన్ రెడ్డి
నగర్, తీర్థ అపార్ట్మెంట్స్, కెన్ వర్క్ అపార్ట్మెంట్స్, భవాని కాలనీ, ఎన్ పి ఏ కాలనీ, ప్రేమావతి పేట్, రాజేంద్రనగర్, మాణిక్యమ్మ కాలనీ, బుద్వేల్, భగవత్ గూడా, ఉప్పర్ పల్లి, చింతల్ మెట్, ఎర్రబోడ, హైదర్గూడా, అత్తాపూర్, రాంబాగ్, పాండురంగ నగర్, మారుతి నగర్, సాయి కాలనీ, అంబియన్స్ ఫోర్ట్ కాలనీ, సిరిమల్లె నగర్, తేజస్విని కాలనీ, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో వినాయకుడి పూజలను భక్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక ప్రజా
ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, యువజన సంఘాల నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాబుల్ రెడ్డి నగర్, శివరాంపల్లి, గగన్ పహాడ్ ప్రాంతాల్లో జరిగిన వినాయకుడి పూజలో బి ఆర్ ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి పి కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ నాయకులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి పలు ప్రాంతాల్లో జరిగిన వినాయకుడి పూజలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విగ్నేశ్వరూడి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు కోరారు. ఈ వినాయకుల పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదలను స్వీకరించారు.Tags:
About The Author
Related Posts
Latest News
23 Sep 2026 11:02:56
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయకుల ప్రత్యేక పూజలతో పాటు...
