ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలి:గుడిపూడి తిరుమల రావు 

పారదర్శకత, నిష్పక్షపాతమే ఎన్నికల సంఘానికి ప్రాధాన్యం కావాలి: గుడిపూడి తిరుమల రావు

Published On
ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలి:గుడిపూడి తిరుమల రావు 

 

 

కారేపల్లి, అక్టోబర్ 7 (లోకల్ గైడ్ న్యూస్):

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమల రావు అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలు, ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆధారాలతో సమాధానం ఇవ్వాలని కోరారు.

ఓటర్ల జాబితాల రూపకల్పన నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తిరుమల రావు డిమాండ్ చేశారు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం ద్వారా ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని గుడిపూడి తిరుమల రావు కోరారు.

Tags:

About The Author

Latest News