ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 

ఓట్ల తొలగింపును నిలిపివేయాలి.. ఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి: కొండబోయిన నాగేశ్వరరావు

Published On
ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 

 

 

కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్):

ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరారు. గురువారం కారేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తొలగించిన అర్హులైన ఓట్లను వెంటనే తిరిగి జాబితాలో చేర్చాలని కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసి అరెస్టులు చేయడం సరికాదని నాగేశ్వరరావు అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షించాలని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని, ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై లాఠీచార్జ్‌, అరెస్టులను తక్షణమే నిలిపివేయాలని కోరారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్