మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 

గుక్కెడు నీటి కోసం మహాదేవపూర్ వాసుల తల్లడిల్లు! అధికారుల నిర్లక్ష్యంపై గరీబుల ఆగ్రహం..

'మంత్రి శ్రీధర్ బాబు వద్దకే వెళ్లాలా?' అని ప్రశ్న?
Published On
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 

 

 

భూపాలపల్లి :(లోకల్ గైడ్ ప్రతినిధి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా 
మహాదేవపూర్ కేంద్రంలోని కేంద్రంలోని కొన్ని ఏరియాలో (దుబ్బగూడెం)లో  తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గత మూడు నెలలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఇక్కడి పేద కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నాయి. రోజువారీ పనులు వదులుకుని నీటి వేటలోనే సమయం గడిపిపోతోందని స్థానికులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు.
మహాదేవపూర్ లోని కొన్ని వార్డులో ఏరియాలోని నిరుపేద కుటుంబాలు తాగునీటి అవసరాల కోసం పూర్తిగా మిషన్ భగీరథపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే గత పావుత్రైమాసిక కాలంగా కుళాయిల్లో బొట్టు నీరు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికే వెళ్లి ఫిర్యాదు చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మహాదేవపూర్ (దుబ్బగూడెం)కొన్ని వార్డులో  మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్