- District News
- బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి,
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి,
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని అన్ని గ్రామాల పరిధిలోని బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో విద్యుత్ లైటింగ్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టాలని,గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిపిఐ తాండూరు మండల కార్యదర్శి కొండు బానేష్ తెలిపారు.గ్రామాలలోని పని చేయని వీధిలైట్లను గుర్తించి మరమ్మతులు చేయడంతో పాటు,అవసరమైన ప్రాంతాల్లో కొత్త లైట్లను ఏర్పాటు చేసి విద్యుత్ స్థంభాలు ఫిట్ చేయాలని,పండుగ సందర్భంగా రాత్రి వేళల్లో గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు అందేలా చర్యలు తీసుకోవాలని బతుకమ్మ పండుగను ప్రతి గ్రామంలో ప్రజలందరు సంతోషంగా,సురక్షితంగా జరుపుకునేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.పారిశుద్ధ్యం,వీధి లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు.
