ప్రభుత్వ పాఠశాలలకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల పంపిణీ

Published On
ప్రభుత్వ పాఠశాలలకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల పంపిణీ

 

సత్తుపల్లి, అక్టోబర్ 8: లోకల్ గైడ్:

సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

గురువారం సత్తుపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సమక్షంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, ఐఏఎస్ చేతుల మీదుగా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై అవగాహన, మాట్లాడే నైపుణ్యం పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కార్యక్రమంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, తహసీల్దార్ ఎమ్మార్వో ఎంపీడీవో,  వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, ప్రైవేటు విద్యాసంస్థలు యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ