నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 

కాంగ్రెస్ శ్రేణులకు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు భూక్యా రంజిత్ కుమార్ పిలుపు.. నాచారం సభకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి

Published On
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 

 

 

కారేపల్లి, అక్టోబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం (అక్టోబర్ 18) ఏన్కూరు మండలం నాచారం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో సింగరేణి మండలంలోని సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు నాచారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఉదయం 11.30 గంటలకు జరిగే సమావేశంతో పాటు వైరా నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్ఏలు) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి మండల పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు సకాలంలో నాచారం గ్రామానికి చేరుకోవాలని భూక్యా రంజిత్ కుమార్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో వ్యవహరించాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు సమయపాలన పాటిస్తూ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణుల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, సింగరేణి మండలం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ