కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.

Published On
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.

 

నిర్మల్ : లోకల్ గైడ్:
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ సర్పంచ్‌ పెంట దశరత్‌ చెక్‌ పవర్‌ను ఆరు నెలల పాటు నిలిపివేయడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకేట పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. 
శనివారం కల్లూరులో చేపట్టిన నిరసన దీక్ష లో ఆయన పాల్గొని ప్రసంగించారు.స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్‌ జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ను ఫ్రీజ్‌ చేయించారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు పరిపాలనపై పూర్తి అవగాహన లేకపోవడంతో తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత సర్పంచ్‌ల నుంచి వివరణ కోరడంతో పాటు, ఆరోపణలపై న్యాయబద్ధంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగినట్లు తేలితే మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా హెచ్చరించాల్సిన అవసరం ఉందన్నారు.
కల్లూరు సర్పంచ్‌ దశరత్‌ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన చెక్‌ పవర్‌ను ఆరు నెలల పాటు నిలిపివేయడం సమంజసం కాదని పోశెట్టి అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గానికి చెందిన సర్పంచ్‌ కావడం వల్లే వివక్ష చూపుతున్నారనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న ఇతర సర్పంచ్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.
సర్పంచ్‌ దశరత్‌ సమర్పించిన బిల్లులపై సంబంధిత అధికారులు సంతకాలు చేసినట్లయితే, ఆ వ్యవహారంలో అధికారుల బాధ్యతను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను తిరిగి పునరుద్ధరించాలని అధికారులను కోరారు.
తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సుంకేట పోశెట్టి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకుడు గంగాధర్‌ గైక్వాడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సాయిరాం అంబేకర్‌, శంకర్‌ గోరెకర్‌, అనిల్‌ గురుకర్‌, బీవీఎం నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ