- District News
- Khammam
- వడ్డే ఉమ కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
వడ్డే ఉమ కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి
సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు శ్రీమతి వడ్డే ఉమ దశదిన కార్యక్రమం గురువారం ఆమె స్వగ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి హాజరై ఉమ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రావతి, వారి దుఃఖంలో భాగస్వాములై ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళా రైతు ఉమ మృతి గ్రామానికి, కుటుంబానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జిల్లా యువజన నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, తాత వెంకటేశ్వర్లు, తాత ఉపేందర్‌రావు, సురపరెడ్డి రవీందర్‌రెడ్డి, చాగంటి కోటయ్య, తమ్మిని ముత్తయ్య, దొంతు దాసు, వడ్డే వెంకటేశ్వర్లు, బానోత్ రాందాస్ (భజ్యాతండా), తమ్మినేని రాధాకృష్ణ, మెకానిక్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
