సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌వో ధనరాజ్

Published On
సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌వో ధనరాజ్

సిద్దిపేట, ఆగస్టు 13(లోకల్ గైడ్):

నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సీహెచ్. ధనరాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.అనంతరం రాఘవాపూర్ సబ్‌సెంటర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో అక్కడ నిర్వహిస్తున్న సార్వత్రిక టీకాల కార్యక్రమం (UIP) సెషన్‌ను పరిశీలించారు. టీకాల కార్యక్రమాన్ని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.హెల్త్ ఎడ్యుకేటర్, సూపర్‌వైజర్ ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో మాట్లాడిన డీఎంహెచ్‌వో కాలానుగుణ వ్యాధుల నివారణ, నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని డా. ధనరాజ్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం ఆరోగ్య సందేశాలను చేరవేయాలని సూచించారు.

Tags:

About The Author

Latest News