గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్

కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలి.

*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
Published On
గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్

ఖమ్మం, ఆగస్టు -21: లోకల్ గైడ్:

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ అన్నారు.

జిల్లాలోని వివిధ కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

పల్లిపాడు–ఏన్కూర్ మార్గంలో నిమ్మవాగు ద్వారా వైరా చెరువుకు ప్రవహిస్తున్న నీటిని, ఏన్కూర్ వద్ద సీతారామ కాలువ 18ఎల్ లింక్ (రాజీవ్ సాగర్) ద్వారా నాగార్జున సాగర్ కాలువకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.

ఏన్కూరు ఎన్‌ఎస్‌పీ 52వ కిలోమీటర్‌ వద్ద ఉన్న రెగ్యులేటర్‌ను కలెక్టర్‌ పరిశీలించి, అక్కడ నీటి మట్టం, ప్రవాహం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్న తీరును పరిశీలించారు.

కల్లూరు మండలం పాయపూర్‌ వద్ద మధిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పుణ్యపురం మేజర్‌ కాలువ ద్వారా చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కల్లూరు– బత్తులపల్లి మార్గంలో ఎన్‌ఎస్‌పీ 21 వ ప్రధాన కెనాల్‌ ద్వారా కల్లూరు పెద్ద చెరువు కు చేరుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

కప్పలబంధం వద్ద ఎన్ఎస్పీపై మధిర బ్రాంచ్‌ కెనాల్‌ చీలే 72వ కిలోమీటర్‌ ప్రాంతాన్ని తనిఖీ చేసి నీటి ప్రవాహ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి చీలే అవుట్‌ ద్వారా మేజర్‌ కాలువకు చేరుతున్న నీటిని వెన్నవల్లి, నేలపాడు, తెలగవరం గ్రామాల వద్ద పరిశీలించారు.

మధిర బ్రాంచ్‌ కెనాల్‌ 24వ కిలోమీటర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రెగ్యులేటర్‌ను కూడా కలెక్టర్‌ పరిశీలించారు. రెగ్యులేటర్‌ ద్వారా జరుగుతున్న నీటి ప్రవాహం, దిగువ ప్రాంతాలకు అందుతున్న నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వేంసూరు మండలంలోని లంకాసాగర్‌ చెరువుతో పాటు వివిధ చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆయా చెరువులకు నీరు చేరుతున్న విధానం, నీటి లభ్యత తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రస్తుతం సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో కృష్ణా బేసిన్‌ పరిధిలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గోదావరి నుంచి తరలిస్తున్న నీటిని త్రాగునీటి  అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలని, త్రాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాధాన్యత క్రమంలో నీటిని వినియోగించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వివిధ కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

కృష్ణా బేసిన్‌ పరిధిలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో త్రాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట ముందస్తు ప్రణాళికతో నీటి సరఫరా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

నీటి ప్రవాహాల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా కాలువలు, రెగ్యులేటర్లు, అవుట్‌లెట్లను నిరంతరం తనిఖీ చేయాలని, నీటి లభ్యతను బట్టి చెరువులను నింపేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ఇర్రిగేషన్ సీఈ వాసంతి, ఖమ్మం ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు,  కల్లూరు ఎస్‌ఈ శ్రీకాంత్‌,  వైరా ఈఈ బాబురావు, సత్తుపల్లి ఈఈ అర్జున్‌, డిఈ లు, ఏఇ లు తదితర ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!    
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి