- District News
- ఘనంగా బోనాల ఉత్సవాలు
ఘనంగా బోనాల ఉత్సవాలు
పోతరాజు వేషధారణలో విద్యార్థుల సందడి
Published On
By Ram Reddy
తుర్కపల్లి, ఆగస్టు 08: లోకల్ గైడ్
తుర్కపల్లి మండల కేంద్రంలో నీ అక్షర అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో శనివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరించడంతో పాటు పోతరాజు వేషధారణలో ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బోనాల ఉత్సవాలను నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ జంగిటి శ్రీనివాస్, డైరెక్టర్లు సంతోష్ కుమార్, బింగి క్రిష్ణ, ఉపాధ్యాయినులు సంతోషి, రాధ, రామలీల, లత, ఉష శ్రీ, శ్రావణి, సంగీత, సుప్రియ, శిరీషతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Aug 2026 21:01:39
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి*
కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
