- District News
- కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
Published On
By Ram Reddy
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కల్లుగీత కార్మిక సంఘం సుదీర్ఘ పోరాటాల ఫలితమని కల్లుగీత కార్మిక సంఘం కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకుని కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాటి రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిందన్నారు. గత మూడు సంవత్సరాలుగా తాటి చెట్ల నుంచి పడిపోయి బాధితులైన గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల చేయడం హర్షణీయమన్నారు. అయితే గీత కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గీత కార్మికుల సొసైటీకి తాటి, ఈత చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని, రైతు బీమా తరహాలో ‘గీతన్న బీమా’ పథకాన్ని అమలు చేసి మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అనాదిగా కల్లుగీత వృత్తిపై ఆధారపడుతున్న 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు వృత్తి పింఛన్ మంజూరు చేయాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రద్దు చేసిన గీత కార్మికుల సొసైటీలను పునరుద్ధరించాలని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిరా కేంద్రాన్ని ప్రారంభించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తాటి రాజబాబు గౌడ్, తాటి కోటేష్ గౌడ్, తాటి రామచంద్రం గౌడ్, తాటి నాగేష్ గౌడ్, తాటి శిశాంత్ గౌడ్, మారగోని శంకర్ గౌడ్, కోడూరు చంటి గౌడ్, కోడూరు భాస్కర్ గౌడ్, ముక్కెర సమ్మయ్య గౌడ్, ముక్కెర రాజు గౌడ్, చీకటి రాజు గౌడ్ తదితరులు, సుమారు 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Aug 2026 21:01:39
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి*
కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
