రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు

జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ పోటీల్లో మూడు పతకాలు

Published On
రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు

 

 

 

 

పెద్దపల్లిజిల్లా ప్రతినిధి సెప్టెంబరు 16 (లోకల్ గైడ్) టేబుల్‌టన్నిస్‌ పోటీల్లో సుల్తానాబాద్‌ ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇటీవల సుల్తానాబాద్‌లోని ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించి 17న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీలకు అర్హత సాధించారు.15 సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్‌. సహర్ష్‌ బంగారు పతకం సాధించాడు. 13 సంవత్సరాల బాలుర విభాగంలో పి. కౌశిక్‌, శ్రీతన్‌ దీక్షన్ కాంస్య పతకాలు సాధించారు. వీరి ప్రతిభకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్‌ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసిన టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ సత్యనారాయణను అభినందించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పాఠశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సునీత, మేనేజర్‌ శివ, పీఈటీలు సతీష్‌, జ్యోతి పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్