ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ.

దేశ రక్షణ, అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం.

మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ 
Published On
ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ.

లోకల్ గైడ్/తాండూర్:
ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని...ఆయన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ కొనియాడారు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం తాండూర్ పట్టణంలోని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షులు యు రమేష్ కుమార్ మాట్లాడుతూ...మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశ అభివృద్ధి, దేశ రక్షణ, పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో సమానంగా భారత్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా 
కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంతో పాటు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూ పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ దేశానికి రక్షణ కల్పిస్తున్న నాయకుడు మోదీ అని కొనియాడారు.
ప్రధాని కావాలనే లక్ష్యంతో కాకుండా దేశ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మోదీ పనిచేస్తున్నారని అన్నారు. ఆయనపై విమర్శలు చేయడం తప్ప దేశ అభివృద్ధికి సహకరించడంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయని విమర్శించారు.
తెలంగాణలో సెప్టెంబర్‌ 17ను కేవలం విలీన దినోత్సవంగా కాకుండా విమోచన దినోత్సవంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, నెలరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేష్ కుమార్, బిజెపి ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీశైలం, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డి, మాజీ అధ్యక్షులు మాధవరెడ్డి, జిల్లా కన్వీనర్ బంటారం భద్రేశ్వర్,మెట్టు శ్రీహరి, బీసీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు, గాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News