- District News
- ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో వినాయక చవితి పర్వదినం సోమవారం భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరు సుఖశాంతులతో వీరాజిల్లుతు పాడిపంటలు సమృద్ధిగా పండేలా దీవించాలని సర్వవిఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడిని పూజించినట్లు తెలిపారు.పట్టణంలోని15వ వార్డులో కౌన్సిలర్ చింతల వసంత,పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో,రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ లు ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన వినాయక మండపాలను సందర్శించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.భక్తులు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని వినాయక మండపాలను ఏర్పాటు చేసి ఆ గణపతి దేవుని ప్రతిష్టించి పూజలు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు.అదేవిధంగా ఇటీవల కాజీపేట2 గని ప్రమాదంలో గాయపడిన బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీకి చెందిన లక్కపట్ల క్రాంతి కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అత్యవసర సమయంలో ఎలాంటి వైద్య సహాయ సహకారాలు అవసరం ఉన్న తనకు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.ఎమ్మెల్యే వెంట నాయకులు దావ రమేష్,చిలుమల శంకర్,దేవసాని ఆనంద్,కన్నూరి వెంకటేష్,డి రమేష్,చింతల లోకేశ్వర్,హరీష్,సాయి తదితరులు ఉన్నారు.
