- District News
- Ranga Reddy
- సూర్యలక్ష్మి కాటన్ మిల్ అధ్యక్షుడు నారాయణకు ఘన సన్మానం
సూర్యలక్ష్మి కాటన్ మిల్ అధ్యక్షుడు నారాయణకు ఘన సన్మానం
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు: సూర్య లక్ష్మి కాటన్ మిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరై నారాయణను ఘనంగా సన్మానించారు. సూర్య లక్ష్మి కాటన్ మిల్ లో నారాయణ అధ్యక్షతన గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.
నారాయణ మిల్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికులు, యాజమాన్యం మధ్య సమన్వయంతో పనిచేశారని, సంస్థ అభివృద్ధిలో ఆయన పాత్ర అభినందనీయమని తల్లోజు ఆచారి పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం నారాయణ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీఎంఎస్ కార్మిక సంఘం నాయకులు, సూర్యలక్ష్మి కాటన్ మిల్ అధికారులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొని నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ సేవలను కొనియాడుతూ శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
