- District News
- విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన ఉండాలి.
విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన ఉండాలి.
మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన ఉండాలని జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత విజ్ఞాన మేళాలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ లను ప్రారంభించి,అభినందించారు.అనంతరం ఆమె మాట్లాడుతు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.చదువుతోనే ఎన్నోవిధాల జీవిత లక్ష్యాలను అధిగమించవచ్చని అన్నారు.విద్యార్థి దశలో చదువు తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా చదువు పట్ల మక్కువతో ఇష్టపడి చదువుతు ఉండాలని తెలిపారు.ముఖ్యంగా సెల్ ఫోన్,టీవీలకు దూరంగా ఉండి ఉన్నత చదువుల లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మి,సుద్దమల్ల హరికృష్ణ,చిలువేరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
