పిల్లలకు క్యాన్సర్ చికిత్స విధానంలో తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి .

Published On
పిల్లలకు క్యాన్సర్ చికిత్స విధానంలో తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి .

ఖమ్మం, సెప్టెంబరు ,17: లోకల్ గైడ్ : 
ఖమ్మం : యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత 20 సంవత్సరాలగా చిన్న పిల్లలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అనుభవం కలిగిన యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ డాక్టర్ పరిణిత రెడ్డి గుత్తా ( పీడియాట్రిక్ ఆంకాలజీ & హెమటాలజీ , క్లినిcal డైరెక్టర్ అండ్ హెచ్ ఓ డి )మాట్లాడుతూ పిల్లలకు వచ్చే క్యాన్సర్ మరియు క్యాన్సర్ చికిత్స పై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు . చిన్నపిల్లలకు క్యాన్సిల్ అనేది అరుదైన విషయం కాకపోతే దీని గురించి అవగాహన చాలా ముఖ్యం . పూర్తిగా నయం అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉంటాయి (దాదాపు 80%) . పుట్టిన నాటి నుండి 18 సంవత్సరాలు వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి . చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్ యొక్క చికిత్స విధానాలు , పెద్దవారికి వచ్చే క్యాన్సర్ లకు చాలా తేడా ఉంటుందని అన్నారు . పిల్లల క్యాన్సర్ చికిత్సలన్నింటిలోనూ శస్త్రచికిత్స , కీమోథెరపీ రేడియేషన్ , టార్గెటెడ్ థెరపీ , ఇమ్యునోథెరపీ మరియు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ( ఎముక మజ్జ మార్పిడి ) ఉపయోగిస్తారు . మెరుగైన రిజల్ట్ రావడం కోసం చిన్నపిల్లలకి నిర్దేశించబడిన చిన్నపిల్లల డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చికిత్స జరగాలని తెలిపారు . పిల్లల్లో నిరంతరం తగ్గని జ్వరం , రక్తస్రావం , కీళ్ల నొప్పులు , రక్తలేమి ,  కంతలు , తగ్గని వాంతులు , కొత్తగా మెల్లకన్ను రావడం , రాత్రి వేళలో తగ్గని తలనొప్పి వంటివి లక్షణాలు ఉంటే వెంటనే తల్లిదండ్రులు సంబంధించిన డాక్టర్ ను సంప్రదించవలసిందిగా పేర్కొన్నారు . సెప్టెంబర్ నెల చిల్డ్రన్స్ ఎవర్నెస్ మంత్ కాబట్టి దీంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు . ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ డిప్యూటీ జనరల్ మేనేజర్ అనీష్ కుమార్ తివారి , మేనేజర్లు Mr.బాల కృష్ణ , Mr.సాయి రామ్ పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. శంషాబాద్ పల్ మాకుల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
  శంషాబాద్:సెప్టెంబర్19( లోకల్ గైడ్ ప్రతినిధి) శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి
డిజిటల్ మనీకి ఛార్జీల సంకెళ్లు!
గణపయ్య సేవలో కాంగ్రెస్ నాయకుడు ఎన్ఆర్ఐ గుడిపూడి తిరుమల రావు సందడి
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.