- District News
- Nalgonda
- ఎస్ ఎల్ బిసి సొరంగ మార్గాన్ని మే 2028 నాటికి పూర్తి చేసి జూన్ 2028లో నీటిని విడుదల చేస్తాం.
ఎస్ ఎల్ బిసి సొరంగ మార్గాన్ని మే 2028 నాటికి పూర్తి చేసి జూన్ 2028లో నీటిని విడుదల చేస్తాం.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని మే, 2028 నాటికి పూర్తి చేసి జూన్ 2028 లో నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తిప్పర్తి, మాడుగుల పల్లి మండలాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ముందుగా తిప్పర్తి మండలం, దుప్పలపల్లి లో దుప్పలపల్లి నుండి కంకణాలపల్లి మీదుగా ఖాజీరామారం వరకు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ ,పటిష్ట పరచే పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక తిప్పర్తి మండల కేంద్రంలో తిప్పర్తి నుండి సర్వారం వరకు 111 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, పటిష్ట పరిచే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని ,రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందని ,సొరంగమార్గం కూలిపోయిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించి ఇప్పటివరకు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 23 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ అండ్ బి రహదారులు నిర్మిస్తున్నామని,16,000 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.నల్గొండ నియోజకవర్గంలోనే అవుటర్ రింగ్ రోడ్డు కాకుండా వెయ్యి కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో 30 లక్షల రూపాయలతో రోడ్లు, మురికి కాలువలు మంజూరు చేస్తున్నామని, రహదారి సౌకర్యం బాగుంటే వృత్తి, వాణిజ్యాలు,పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం పై ఖర్చు చేస్తూనే రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ,తిప్పర్తి ,మాడుగుల పల్లి మండలాలలో భవిష్యత్తులో విద్యుత్ సమస్య తలెత్తకుండా 200 కోట్ల రూపాయలతో 220 కే.వి సబ్ స్టేషన్ మంజూరు చేయనున్నామని,ఇందుకు పజ్జూరు సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని అధికారులు గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే దుప్పలపల్లికి సబ్ స్టేషన్ మంజూరు చేశామని,వచ్చేవారమే సబ్ స్టేషన్ తో పాటు, స్వయం సహాయక సంఘాల సమ భావన భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్ ఎల్ బి సి ద్వారా సాగునీరు వస్తే రైతులు 2 పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రతి గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నామన్నారు.సిలార్ మియా గూడెం చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.రహదారుల నిర్మాణం తో పాటు, పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 5 లక్షల రూపాయలు ఒక లబ్ధిదారునికి ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించి గ్రామాల స్వరూపాన్ని మార్చాలన్నదే తన లక్ష్యమని మంత్రి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏ. దుప్పలపల్లి సర్పంచ్ ఏ వెంకట్ రెడ్డి, గ్రామాల సర్పంచులు ,ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు ఉన్నారు.
